నిజాంపట్నం మండలం దిండి పంచాయతీ పరిధిలోని ఆదవాల గ్రామంలో నాటు సారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో బాపట్ల ఏ ఈ ఎస్ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో నగరం ఎక్సైజ్ సీఐ శ్రీరాంప్రసాద్, ఒంగోలు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ రాజేంద్ర, బాపట్ల ఎస్సై శ్రీనివాసరావు లు ఏకకాలంలో మూడు ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నాటు సారా తయారీకి ఉపయోగించే 400 లీటర్ల బెల్లం ఊటను, నాటు సారా బట్టిని ధ్వంసం చేశారు.