రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన బాలాజీ పాలెం గ్రామంలో జరిగింది. నిజాంపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామానికి చెందిన నర్ర మణికంఠ కృష్ణ కుమార్ (24) తెనాలి నుండి బైక్ పై బాలాజీ పాలెం వస్తుండగా శనివారం అర్ధరాత్రి సుమారు మూడు గంటల సమయంలో బైక్ అదుపుతప్పి తలకు గాయం అవ్వడంతో మృతి చెందాడు. మృతుడి తండ్రి రాధాకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపతిరావు తెలిపారు.