దేశంలో అన్ని కులాల వారు ఉద్యోగాలు పొందుతున్నారంటే అది డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లేనని మాల మహాసభ జాతీయ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు అన్నారు. ఆదివారం నిజాంపట్నం మండలం ఆముదాల పల్లి పంచాయతీ కొమరవోలు ఎస్సీ ఎస్టీ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ గ్రామంలో 30 గృహాలు ఉన్న దళిత గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకొనటం ఆనందమయం అన్నారు.