నిజాంపట్నం: తీర ప్రాంత గ్రామాలలో నాటుసారా అరికట్టాలి

63చూసినవారు
సముద్ర తీర ప్రాంత గ్రామాలలో నాటు సారా తయారీ మరియు విక్రయాలను పూర్తిగా అరికట్టాలని ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హేమంత నాగరాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిజాంపట్నం మండలంలోని దిండి పంచాయతీ పరిధిలో గల అధవల గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ బాపట్ల జిల్లా అధికారి దేవదత్తు, ఎక్సైజ్ సూపరీంటెండెంట్ వెంకటేశ్వర్లు, నగరం ఎక్సైజ్ సీఐ శ్రీరాం ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్