నిజాంపట్నం: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

57చూసినవారు
నిజాంపట్నం: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఆల్కహాల్ డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు వ్యక్తులపై కాకుండా కుటుంబం పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని బాపట్ల జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం నిజాంపట్నం పంచాయతీ కార్యాలయం నందు అవగాహన సదస్సు నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు మరియు తదుపరి పర్యవసనాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. నగరం ఎక్సైజ్ సీఐ మార్టూరి శ్రీరామ్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్