చెరుకుపల్లిలో పల్లెనిద్ర కార్యక్రమం

69చూసినవారు
చెరుకుపల్లిలో పల్లెనిద్ర కార్యక్రమం
గ్రామాలలో ఘర్షణలు నివారించి స్థానికంగా ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకోవడమే పల్లెనిద్ర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని రేపల్లె డిఎస్పి ఆవల శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం రాత్రి చెరుకుపల్లి పంచాయతీలోని కస్తూరి వారి పేట పల్లెనిద్ర కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రేపల్లె రూరల్ సీఐ సురేష్ బాబు, చెరుకుపల్లి ఎస్ఐ అనిల్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్