విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల దృష్ట్యా ఈనెల 17వ తేదీ నగరం మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ విజయ్ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. వినియోగదారులు, వ్యాపారస్తులు విద్యుత్ అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని విజయ్ శ్రీనివాస్ కోరారు.