చేనేత పితామహుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు స్వర్గీయ ప్రగడ కోటయ్య 29వ వర్ధంతిని మంగళవారం రేపల్లెలో ఘనంగా నిర్వహించారు. రేపల్లె చేనేత సహకార సంఘం వద్ద ప్రగడ కోటయ్య విగ్రహానికి చేనేత సంఘం అధ్యక్షుడు పట్టెం శ్రీనివాసరావు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. చేనేత కార్మికుల కోసం పరాడప్రగడ కోటయ్య రాజీలేని పోరాటం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో రేపల్లె పద్మశాలి సంఘం అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు పాల్గొన్నారు.