విద్యుత్ డిస్కంల సర్దుబాటు పేరుతో పెంచిన విద్యుత్ బారాలని రద్దు చేయాలని కోరుతూ రేపల్లె బస్టాండ్ సెంటర్లో నిరసన తెలిపారు. శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ భారాలు సర్కులర్ దగ్ధం చేసి నిరసన తెలిపారు. అనంతరం సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్. మణిలాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు ఆశలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం మీద సాకు చెబుతూ ట్రూ అప్ చార్జీలు పెంచడం దారుణమన్నారు.