లోక్అదాలత్లో 474 కేసులు పరిష్కారమైనట్లు సీనియర్ సివిల్ జడ్జీ వెన్నెల తెలిపారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కోర్టు హాలులో నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో కేసులను పరిష్కరించి మాట్లాడారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయశాఖ ప్రతి నెల లోక్అదాలత్ పేరుతో పరిష్కారంకు అవకాశం కల్పిస్తుందన్నారు. కక్షిదారులకు లోక్అదాలత్తో సమయం, డబ్బులు ఆదా అవుతాయన్నారు.