రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇస్తున్న ఫిర్యాదులను సంబంధిత అధికారులు నాణ్యతతో సత్వరమే పరిష్కరించాలని ఆర్డీవో రామలక్ష్మి అధికారులను సూచించారు. మొత్తం 6 అర్జీలు వివిధ సమస్యలపై వచ్చాయని ఆర్డీవో రామలక్ష్మి తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.