రేపల్లె రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 7 ఫిర్యాదులు అందినట్లు ఆర్డిఓ రామలక్ష్మి తెలిపారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించామన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.