సంక్రాంతి పండుగ ముసుగులో కోడిపందేలు, పేకాట, మట్కా, క్యాసినో నిర్వహిస్తే నిర్వహుకుల పై కఠిన చర్యలు తీసుకుంటామని రేపల్లె డిఎస్సీ ఆవుల శ్రీనివాసరావు హెచ్చరించారు. శనివారం డిఎస్సీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సంక్రాంతి సెలవుల దృష్ట్యా దొంగతనాలు, కోడిపందేలు, పేకాట, ఇతర జూద క్రీడలను కట్టడి చేసేందుకు సబ్ డివిజన్ లోని ప్రజలకు పలు సూచనలు చేశారు. కోడిపందాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.