వెట్టిచాకిరికి గురైన బొబ్బర్లంక ఎస్టి కాలనీ కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని సీపీఎం రేపటి పట్టణ కార్యదర్శి మణి లాల్ కోరారు. బొబ్బర్లంక ఎస్టి కాలనీలో కూలీలను అమ్మకాలు, కొనుగోళ్లు చేసిన అందరికీ శిక్షలు పడేలా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని రేపల్లె ఆర్డీవో ఎన్. రామలక్ష్మికి సీపీఎం పార్టీ, కెవిపిఎస్, ఐద్వా సంఘాలు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.