దేశంలో కార్పొరేట్ శక్తులు నుంచి దేశాన్ని కాపాడుకోవటానికి భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాటాల్లోకి రావాలని సీపీఎం రేపల్లె పట్టణకార్యదర్శి సిహెచ్. మణిలాల్ పిలుపు నిచ్చారు. ఆదివారం రేపల్లె కొరటాల మీటింగ్ హాల్లో ప్రజాసంఘాలు విద్యార్ధి, యవజన, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి నిర్వహించడం జరిగింది. ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి ప్రజాసంఘాల నాయకులు కె. ఆశ్విర్వాదం పూలమాల వేసి నివాళ్లు తెలిపారు.