రేపల్లె ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఉన్న రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ యార్లగడ్డ దశరథ రామారావు సందర్శించారు. మంగళవారం బ్లడ్ బ్యాంకు పనితీరు పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ రేపల్లె బ్లడ్ బ్యాంక్ పనితీరు బాగుందని ఇంకా బ్లడ్ డొనేషన్లు, ఇష్యులు పెంచుకోవాలన్నారు. రేపల్లె బ్లడ్ బ్యాంక్ 10 కె వి సోలార్ ప్లాంట్ ని గతంలో అందజేసినట్లు గుర్తు చేశారు.