ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఆపదలో ఉన్న పేద ప్రజలకు ఆర్థిక భరోసా ఇస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరులు అనగాని శివప్రసాద్ అన్నారు. మంగళవారం రేపల్లె టీడీపి కార్యాలయంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న సుమారు 70 మంది పేదలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రత్యేక చొరవతో మంజూరైన రూ. 88, 55, 357 రూపాయల చెక్కులను బాధితులకు అందజేశారు.