రేపల్లె పట్టణంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి మణిలాల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కమిషనర్ సాంబశివరావుకు వినతి పత్రం అందించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సుమారు 200 మంది వ్యక్తిగత అర్జీలు కమిషనర్కు అందజేశారు.