భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై అహంకార వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను దళిత సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. అమిత్ షా పార్లమెంటరీ సభ్యత్వం రద్దుచేసి కేంద్ర హోంశాఖ మంత్రి పదవి నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలని కోరుతూ రేపల్లెలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం తాలూకా సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల అమిత్ షా మంత్రి అయ్యాడన్నారు.