18 సంవత్సరాల లోపు బాలలను పనిలో పెట్టుకుంటే ఆ సంస్థలకు జరిమానా విధిస్తామని సహాయ కార్మిక అధికారి ప్రభాకర్ రావు అన్నారు. శనివారం రేపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 15 సంవత్సరాలలోపు పిల్లలను షాపులలోనూ మెకానిక్ షెడ్లలో వెల్డింగ్ షాపులలో ఇటుక బట్టీలలో మరియు ప్రమాదకరమైన సంస్థలలో పనికి పెట్టుకున్నట్లు గుర్తిస్తే ఆ షాప్ యజమానికి ల్లక్ష రూపాయలు జరిమానా విధించడమే కాకుండా జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.