సముద్ర చేపల సంతనోత్పత్తికి, వాటి సంతతి పెరుగుదలకు మరియు సముద్ర మత్స్యసంపదను సుస్థిర పరచుటకు 61 రోజులపాటు వేట నిషేధించినట్లు మత్స్య శాఖ అభివృద్ధి అధికారి షేక్ కౌసర్ తెలిపారు. 15వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు(మొత్తము 61 రోజులు) వరకు సముద్రము యందు యాంత్రిక, మోటారు పడవలచే వేట నిషేదించమన్నారు. నిషేధ సమయంలో వేటకు వెళ్తే బోట్లపై కేసు నమోదు చేయడంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అందవన్నారు.