రేపల్లె: వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎంపీ మోపిదేవి పూజలు

58చూసినవారు
రేపల్లె: వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎంపీ మోపిదేవి పూజలు
వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా రేపల్లె పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు, టిడిపి నాయకుడు మోపిదేవి వెంకట రమణారావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం అనంతరం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

సంబంధిత పోస్ట్