ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని రేపల్లె వైసిపి ఇన్చార్జి డాక్టర్ ఈవూరు గణేష్ అన్నారు. రేపల్లె రూరల్ మండలం లంకెవాని దిబ్బ గ్రామంలో సోమవారం జరిగిన నూతన రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ గణేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీతారాముల దర్శనం చేసుకుని వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. రేపల్లె రూరల్ మండల వైసీపీ కన్వీనర్ మేడికొండ అనిల్, వైసీపీ నాయకులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.