రేపల్లె: ఘనంగా పొట్టి శ్రీ రాములు జయంతి వేడుకలు

55చూసినవారు
శ్రీ పొట్టి శ్రీ రాములు జయంతి సందర్బంగా రేపల్లె ఆర్య వైశ్య సంఘము ఆధ్వర్యంలో.. జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ టౌన్ అంకమ్మ చెట్టు వద్ద ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్య వైశ్య సంఘము నాయకులు విశ్వనాధగుప్త, నారాయణ మూర్తి, ఈశ్వరబాబు, వేణు గోపాలరావు, బాలు, రాజేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్