మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంపుదల చేయాలని, లేని నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకి కార్మికుల సిద్ధంగా ఉన్నారని సీఐటీయు బాపట్ల జిల్లా అధ్యక్షుడు సీహెచ్. మణిలాల్ అన్నారు. బుధవారం రేపల్లె మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి కమిషనర్ కె. సాంబశివరావు కి సమ్మె నోటిస్ అందజేసారు. ఈ కార్యక్రమంలో రేపల్లె మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు డి. ప్రభాకరరావు పాల్గొన్నారు.