రేపల్లె: డ్రైనేజీలో నిలిచిన మురుగు.. ప్రజల అవస్థలు

64చూసినవారు
రేపల్లె: డ్రైనేజీలో నిలిచిన మురుగు.. ప్రజల అవస్థలు
రేపల్లె అంకమ్మ చెట్టు వద్ద మురుగు కాల్వ పారుదల సరిగా లేక విపరీతంగా దురవాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునిసిపల్ సిబ్బందీ ఏదో తీసాం అన్నట్టుగా తీసి వెళ్తారని సోమవారం అన్నారు. విజయవాడ కరకట్ట బస్సు కోసం ప్రయాణికులు ఇక్కడే వేచి చూస్తుంటారని మురుగు నుంచి వచ్చే దుర్వాసనతో అక్కడ వేచి ఉండలేకపోతున్నామని ప్రయాణికులు అంటున్నారు. అధికారులు స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు

సంబంధిత పోస్ట్