కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలంలో సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి ప్రజలకు వివరించే కార్యక్రమం సపరిపాలనలో తొలి అడుగు అని చెరుకుపల్లి పట్టణ టిడిపి అధ్యక్షుడు సొంటి సుబ్బయ్య అన్నారు. స్థానిక నాయకుల సహకారంతో నేటి నుండి గ్రామంలోని అన్ని నివాసాలకు వెళ్లి ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించడం జరుగుతుందన్నారు.