22ఏలో చాలా వరకు భూ సమస్యలు పరిష్కరించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ భూసమస్యలపై 2, 79, 071 ఫిర్యాదులు వచ్చాయని 2, 57, 851 దరఖాస్తులు పరిశీలించామని తెలిపారు. రీసర్వేను మూడేళ్లలో పూర్తి చేస్తామని నిశిద్ధ జాబితా నుంచి తొలగింపునకు ఒక ఫార్ములా ఇచ్చామని అన్నారు. గత ప్రభుత్వంలో చాలా భూ కబ్జాలు చేశారని అన్నారు.