రేపల్లె: మందిరాన్ని కూల్చ వద్దంటూ మహిళల నిరసన

51చూసినవారు
రేపల్లె: మందిరాన్ని కూల్చ వద్దంటూ మహిళల నిరసన
రేపల్లె పట్టణంలోని పదవ వార్డు ఓపెన్ థియేటర్ వెనుకవైపు రచ్చబండపై ఇటీవల సీతారాముల విగ్రహాల ఏర్పాటుకు చిన్నపాటి మందిరాన్ని నిర్మించి అందులో విగ్రహాలను నెలకొల్పుకున్నారు. అనుమతులు లేకుండా ఎటువంటి కట్టడాలు నిర్మించరాదంటూ మున్సిపల్ అధికారులు పోలీసుల సహకారంతో శుక్రవారం మందిరాన్ని పడగొట్టేందుకు యత్నించగా కాలనీవాసులు అధికారులను అడ్డుకుని మందిరం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్