పాఠశాల సమీపంలో వైన్ షాప్ ను ఏర్పాటు చేయడం పట్ల మహిళలు నిరసన వ్యక్తం చేశారు. రేపల్లె రూరల్ మండలం పేటేరులో ప్రైవేటు పాఠశాల సమీపంలో వైన్ షాపును ఎత్తివేయాలని కోరుతూ మహిళలు శుక్రవారం రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ధనాజనే దేయంగా వైన్ షాప్ ని ఏర్పాటు చేయడం వల్ల స్కూలుకు వెళ్లి వచ్చే ఆడపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంటూ మహిళలు మద్యం దుకాణాల వద్ద ఆందోళన నిర్వహించి ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు.