దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల వివాదాలు పరిష్కరించటమే అజెండాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రేపల్లె రూరల్ మండలం పీటర్ గ్రామంలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సులో మంత్రి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అర్జీలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.