ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రేపల్లె ఆర్డిఓ రామలక్ష్మి హెచ్చరించారు. నగరం మండలంలో అక్రమంగా మట్టి త్రవ్వకాలు జరుపుతున్నారన్న సమాచారంతో గురువారం ఆర్డిఓ రామలక్ష్మి తహసిల్దార్ నాంచారయ్యతో కలిసి నగరం మండలంలోని పెదమట్లపూడి, సిరిపుడి, చిన్నమట్లపూడి, పూడివాడ గ్రామాలలో మట్టి త్రవ్వకాలను పరిశీలించారు. మట్టి తవ్వకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.