రేపల్లే: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

73చూసినవారు
యువతీ, యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని బాపట్ల జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం పొన్నపల్లి గ్రామంలోని గీతం జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. డ్రగ్స్ ని తరిమేద్దాం ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదాన్ని అందరిలోకి తీసుకు వెళదామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత పోస్ట్