మహిళల ఆర్థిక స్వావలంబనకు సాంకేతిక సహకారం అవసరమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం రేపల్లె టీడీపీ కార్యాలయంలో మెప్మా రిసోర్స్ పర్సన్స్ కు ట్యాబ్, బయోమెట్రిక్ డివైస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ పొదుపు సంఘాల ఏర్పాటుతోనే మహిళల ఆర్థిక సాధికారత సాధ్యమవుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడాలంటే, అవసరమైన శిక్షణతో పాటు, సాంకేతిక సహకారాన్ని అందజేయాలన్నారు.