రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరలకు బియ్యం,కందిపప్పు అందజేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్ అన్నారు. గురువారం రేపల్లెలోని రామశాస్త్రి కళ్యాణ మండపం ఎదురుగా రైతు బజార్లు, పెద్ద సంస్థాగత రిటైల్ దుకాణాలను ఆయన ప్రారంభించారు. తక్కువ ధరలకే అందజేస్తున్న బియ్యం, కందిపప్పును వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.