దేశవ్యాప్తంగా జరుగుతున్న కేరళ సంఘీభావ కార్యక్రమంలో భాగంగా బుధవారం రేపల్లె సిఐటియు కార్యాలయంలో పలు ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణిలాల్ మాట్లాడుతూ కేరళ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష మానుకోవాలన్నారు. కేరళ ప్రజలకు ప్రజాతంత్ర వాదులందరూ అండగా ఉండాలన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బిజెపి యేతర ప్రభుత్వాల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు.