సత్తనపల్లి నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్ సర్వీస్ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ విజయకుమార్ శనివారం తెలిపారు. జనవరి 26వ తేదీన మధ్యాహ్నం నుంచి బస్సు బయలుదేరుతుంది అన్నారు. 27న అరుణాచలం చేరుకొని కంచి మీదుగా 28వ తేదీ ఉదయం సత్తెనపల్లికి చేరుకుంటుందన్నారు. సూపర్ లగ్జరీ బస్సు టిక్కెట్ ధర రూ. 2, 100గా తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, డిపోలో వివరాలను అడిగి తెలుసుకోవాలన్నారు.