సత్తెనపల్లిలో సుగాలి జడ్పీహెచ్ఎస్ లో 45 రోజుల ఫుట్ బాల్ కోచింగ్ క్యాంపు బుధవారం విజయవంతంగా ముగిసింది. ఏప్రిల్ 26 నుండి జూన్ 11 వరకు జరిగిన ఈ క్యాంపులో 40 మంది బాలికలు, 50 మంది బాలురు పాల్గొన్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శిక్షణతో పాటు పోటీలు నిర్వహించారు. విజేతలకు మెమోంటోలు, మెడల్స్ అందజేశారు. బాలుర విభాగంలో మాదల గ్రామం మొదటి బహుమతి సాధించింది.