సత్తెనపల్లి పట్టణంలోని కబ్బయ్యస్వామి ఆలయ ప్రాంగణంలో గజ్జల నారాయణమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో నరసరావుపేట జీబీఆర్ హాస్పిటల్ సహకారంతో ఈనెల 15న సాయంత్రం 5 గంటల నుంచి ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించనున్నారు. ఎముకలు, కీళ్లు, గుండె, థైరాయిడ్, బీపీ, షుగర్, ఆయాసం, ప్రసూతి, దంత వైద్యవ్యాధులకు తగిన పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని సత్తెనపల్లి సమన్వయకర్త భార్గవ్ రెడ్డి బుధవారం తెలిపారు.