నకరికల్లు గ్రామానికి చెందిన కళ్లకుంట సైదులు, ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతను అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై నడుచుకుంటూ ఉండగా, అతివేగంగా వస్తున్న ఒక గుర్తు తెలియని లారీ అతన్ని గుద్దడంతో జరిగిన ప్రమాదంలో రెండు మోకాళ్ళ మధ్య భాగం విరిగిపోయిందని సమాచారం. 108 అంబులెన్స్ ద్వారా నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించిన అనంతరం గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని GGH కి పంపగా, చికిత్స పొందుతూ మరణించాడు.