క్రోసూరు: ఇన్‌ఛార్జ్ తాహసీల్దార్ గా శ్రీనివాసరావు బాధ్యతలు

55చూసినవారు
క్రోసూరు: ఇన్‌ఛార్జ్ తాహసీల్దార్ గా శ్రీనివాసరావు బాధ్యతలు
క్రోసూరు మండల డిప్యూటీ తహశీల్దార్ గా పని చేస్తున్న సిహెచ్. శ్రీనివాసరావు ఇన్‌ఛార్జ్ తహశీల్దార్ గా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు నేరుగా తమను కలవవచ్చునని శ్రీనివాసరావు తెలియజేశారు. ఇన్‌ఛార్జ్ తహశీల్దార్ గా బాధ్యతలు తీసుకోవడం పట్ల ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్