విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

84చూసినవారు
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో విద్యుత్ షాక్ కు గురై సూరె ముక్కంటి(42)అనే కూలి ఆదివారం మృతి చెందాడు. నిర్మాణంలో ఉన్న భవనానికి పరంజీ ఏర్పాటు చేసే క్రమంలో ఇనుప పైపును తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్