తెదేపా మద్దతుదారుడికి చెందిన మిరప పంటను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన తొండపి గ్రామంలో శనివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన నిమ్మకాయల రసూల్ మూడు ఎకరాల్లో మిరప పంట సాగు చేస్తున్నారు. పంట రెండో కాపు దశలో ఉంది. గుర్తుతెలియని వ్యక్తులు 100కి పైగా మొక్కల్ని ధ్వంసం చేశారని పోలీసులకు రసూల్ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.