ముప్పాళ్ల: హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్టు

51చూసినవారు
ముప్పాళ్ల: హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్టు
ముప్పాళ్ల మండలంలోని మాదల గ్రామానికి చెందిన మహబూబ్ సుభాని అలియాస్ కాలాపై ఆదివారం దాడి చేసి గాయపర్చిన తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్సై సోమేశ్వరరావు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చినబాజితోపాటు మరొకరికి అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్