నకరికల్లు మండల పరిధిలోని గుండ్లపల్లి నరసింగపాడు త్రిపురాపురం నకరికల్లు గ్రామాలలో దాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం అధికారులు ఏర్పాటు చేశారు. 2024 - 25 సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్ముకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. రబీలో ఈ పంట నమోదు చేసుకొని ఫార్మర్ ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి దేవదాస్ పేర్కొన్నారు.