సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ముమ్మరంగా సాగుతున్న సిల్ట్ వర్క్ పనులు శనివారం నిర్వహిస్తున్నారు. రాబోయే వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మురుగునీటి నిల్వ సమస్య లేకుండా చూడాలని అధికారులను సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ ఆనంద్ కుమార్ సిబ్బందికి పనులు పురమాయించారు. మురుగునీటి నిల్వలను గుర్తించి సమస్య లేకుండా చూస్తున్నారు.