పల్నాడు జిల్లా పెట్రువారిపాలెంలో ఏరువాక పండుగ సందర్భంగా బుధవారం భూమాతకు పూజలు చేసి, హలంపట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. ఇది రైతుల పండుగని, వ్యవసాయ రంగాన్ని కూటమి ప్రభుత్వం బలపరిచే దిశగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారని చెప్పారు.