పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బ్రహ్మణపల్లిలో ఆదివారం పెట్రోల్ బాంబుల ముడిసరుకు లభ్యం అయింది. గడ్డి వాములో నిల్వచేసిన పెట్రోల్, 8 బీరు సీసాలు, 9 మద్యం బాటిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఎవరు పెట్టారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సింది.