పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారన్న కేసులో నోటీసులు అందుకున్న ముగ్గురు నేతలు ఆదివారం సత్తెనపల్లి పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. గత నెల 18న బల ప్రదర్శన, ఆస్తుల ధ్వంసంపై కేసు నమోదైంది.