సత్తెనపల్లి పట్టణంలోని టీచర్స్ మస్తాన్ ఐటిఐ కళాశాలలో హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా బుధవారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సిఎస్సి కోర్టు సీనియర్ సూపర్నెంట్ పివిపి అంజనీకుమారికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా యువత చదువును సార్ధకం చేసుకుంటే, కుటుంబం మరియు సమాజానికి ఉపయోగపడుతుందని తెలిపారు. 180 మందికి పైగా నిరుద్యోగ యువత పాల్గొని, 17 వివిధ కంపెనీల నుంచి అవకాశాలు పొందారు.